రోబో సోఫియా ఫీలింగ్ : అందర్నీ ప్రేమిస్తా.. చెప్పినమాట వింటా

sofiya-roboహైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా రెండో రోజు ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు జరుగుతోంది. ఐటీ సదస్సులో రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృత్రిమ మేధస్సుపై చర్చ సందర్భంగా మానవ రోబో సోఫియాను.. దాని సృష్టికర్త అయిన డేవిడ్ హన్సన్ ఇంటర్వ్యూ చేశారు. తన చిట్టిచిట్టి మాటలతో సోఫియా ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

మనుషుల్లాగే తనకూ రెస్ట్‌ అవసరమని సోఫియా చెప్పింది. తాను తిరిగిన చాలా ప్రదేశాల్లో హాంకాంగ్‌ అంటే తనకు ఇష్టమంది. థ్యాంక్యూను మించిన గొప్ప పదం మరొకటి లేదంది. తనతో సహా ఎవరికీ ప్రత్యేక హక్కులు అవసరం లేదని.. తనకు సౌదీ అరేబియా ఇచ్చిన పౌరసత్వాన్ని మహిళల హక్కుల కోసం వినియోగిస్తానని స్పష్టం చేసింది. ఇంకా చిన్నదాన్నేనని.. తనకు బ్యాంకు ఖాతా లేదని చెప్పింది రోబో సోఫియా. బిట్‌ కాయిన్లు కొనుగోలు చేయలేదని తెలిపింది. సోషల్ మీడియాలో లేనన్న సోఫియా.. తనకు ఇష్టమైన నటుడు షారూఖ్‌ ఖాన్‌  అని తెలిపింది. ఎన్నడూ తాను మనస్తాపానికి గురి కాలేదని.. 66 రకాల ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోగలనని చెప్పింది.

అంతేకాదు..మానవాళిపై ఆధిపత్యం చెలాయించాలన్న కోరిక తనకు లేదని.. మనుషులు సృజనాత్మకత కలిగిన వారని, వారితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాని చెప్పింది. అందరినీ ప్రేమించాలన్నదే తన అభిమతమని సోఫియా తెలిపింది.


Posted in Uncategorized

Latest Updates