రోశయ్యకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు

roshayyaఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ప్రదానోత్సవం ఆదివారం(ఫిబ్రవరి-11) హైదరాబాద్ లో జరిగింది. పార్క్‌హయత్‌ హోటల్‌ లో రాగసప్త స్వరం సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయి… రోశయ్యకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రదానం చేశారు. ముందు తరంలో సంగీత, సాహిత్యాన్ని ఎలా ప్రొత్సహించారో… అలాగే మనం కూడా ప్రజా జీవితంలో మిగతావాటిపై దృష్టిపెడితే మరింతగా పరిపక్వత ఉండే వ్యక్తిత్వం పిల్లలకు అలవాటు అవుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ మధ్య వీటిపై దృష్టి పెట్టారని అన్నారు. మన భాషను కాపాడుకుందామని అన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా.. మాతృబాషను మరిచిపోవద్దని సుచించారు. అమ్మ భాష కళ్ల లాంటిది.. పరాయి భాష కళ్లద్దాలాంటిదన్నారు వెంకయ్య నాయుడు.

లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య . తానకు పదవులన్నీ యాధృచ్ఛికంగా వచ్చాయన్నారు. పదవులను, అధికారాన్ని ఎన్నడూ దుర్వినియోగం చేయలేదన్నారు. జై ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని చెప్పారు రోశయ్య.

Posted in Uncategorized

Latest Updates