రౌడీషీటర్లను బైండోవర్ చేశాం : డీజీపీ మహేందర్ రెడ్డి

రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే చర్యలు చేపట్టింది. నిబంధనలను విడుదల చేసింది. మరోవైపు పోలీసులు సన్నద్ధమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల గుర్తించడంతో పాటు… ఇప్పటికే రౌడీషీటర్లను బైండోవర్ చేశామని  డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈసీ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చామని  తెలిపారు. హైదరాబాద్ లో పోలీస్ ఉన్నతాధికారులతో ఇవాళ ఈసీ సమావేశం నిర్వహించారు. వీవీ పాట్స్, సీ విజిల్స్, సువిధ యాప్ పై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపుపై చర్చించామన్నారు.  లైసెన్స్ తుపాకులను డిపాజిట్ చేయాలని సూచించామన్నారు. మూడేళ్లు సర్వీస్ పూర్తయిన వారిని బదిలీ చేయాలని ఈసీ సూచించిందన్నారు. 17వ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. పక్క రాష్ట్రాల పోలీసులతోనూ సమన్వయం చేసుకుంటామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates