రౌడీ రికార్డ్.. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో విజయ్ దేవరకొండ

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో క్రెడిట్ కొట్టేశాడు. భారతీయ సెలబ్రిటీ సంపన్నుల లిస్ట్ లో చేరిపోయాడు. సెలబ్రిటీ సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ కంపెనీ ఏటా విడుదల చేస్తుంటుంది. 2018కి గానూ.. తాజా ఆ లిస్ట్ ను విడుదల చేసింది ఫోర్బ్స్. ఇందులో…  టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు 72వ స్థానం దక్కింది. అతడు ఏటా రూ.14 కోట్లు సంపాదిస్తున్నట్టు ఫోర్బ్స్ వివరించింది.

రామ్ చరణ్ తో కలిసి 72వ స్థానంలో విజయ్ దేవరకొండ

అతి తక్కువ సినిమాలు చేసి.. ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న భారతీయ సెలబ్రిటీల్లో ఒకడిగా విజయ్ దేవరకొండ ఘనత సాధించాడు. ఫోర్బ్స్ జాబితాలో టాప్ హండ్రెడ్ లో ర్యాంక్ దక్కించుకున్న అతి చిన్న సౌతిండియన్ హీరో విజయ్ దేవరకొండనే. విజయ్ దేవరకొండ కంటే ముందు.. 71 వ స్థానంలో కమల్ హాసన్, ఆ తర్వాత రామ్ చరణ్ ఉన్నారు. ఏటా రూ.14 కోట్లతో రామ్ చరణ్ తో 72వ స్థానాన్ని పంచుకున్నాడు ఈ రౌడీ.

ఫోర్బ్స్ టాప్ హండ్రెడ్ రిచెస్ట్ సెలబ్రిటీస్ లిస్ట్ లో రూ.253.25 కోట్లతో సల్మాన్ ఖాన్ టాప్ లో ఉన్నాడు. రూ.228.09 కోట్లతో టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో… రూ.185 కోట్లతో అక్షయ్ కుమార్ మూడోస్థానంలో ఉన్నారు. హయ్యెస్ట్ ఎర్నింగ్ హీరోయిన్ క్రెడిట్ ను దీపికా పడుకోన్ సంపాదించింది. ఎక్కువ సంపాదించే డైరెక్టర్ గా తెలుగు దర్శకుడు కొరటాల శివ రూ.20కోట్లతో 39వ స్థానంలో ఉన్నాడు.

టాప్ టెన్ లో ఇంకా మిగతా సెలబ్రిటీల వివరాలు చూద్దాం.

  1. సల్మాన్ ఖాన్ – రూ.253.25 కోట్లు
  2. విరాట్ కోహ్లీ – రూ.228.09 కోట్లు
  3. అక్షయ్ కుమార్ – రూ. 185కోట్లు
  4. దీపికా పడుకోన్ – రూ.112.8కోట్లు
  5. మహేంద్రసింగ్ ధోనీ – రూ. 101.77 కోట్లు
  6. ఆమిర్ ఖాన్ – రూ. 97.5కోట్లు
  7. అమితాబ్ బచ్చన్ – రూ. 96.17కోట్లు
  8. రణ్ వీర్ సింగ్ – రూ. 84.67కోట్లు
  9. సచిన్ టెండూల్కర్ – రూ.80కోట్లు
  10. అజయ్ దేవ్ గణ్ – రూ.74.5 కోట్లు

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates