రౌహనీ రాకతో బంధం మరింత బలోపేతం అయ్యింది: మోడీ

modiఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ, ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. చర్చల తర్వాత కీలక ఒప్పందాల్లో భాగంగా తొమ్మిది అగ్రిమెంట్లపై సంతకాలు జరిగాయి. చాబహర్ పోర్ట్ వినియోగం, వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యం లాంటి రంగాల్లో అగ్రిమెంట్లు కుదిరాయి. రోహనీ, మోడీలు కలిసి సంయుక్తంగా పోస్టల్ స్టాంపులను కూడా రిలీజ్ చేశారు. రోహనీ రాకతో రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు మోడీ. ప్రెసిడెంట్ రౌహనీ విజన్‌ను అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ద్వైపాక్షిక ఆర్థిక సహకారంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని ప్రధాని మోడీ చెప్పారు. రెండు దేశాల మధ్య స్నేహం పెరిగిందని ఇరాన్ అధ్యక్షుడు రౌహనీ అన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates