ర్యాగింగ్‌కు పాల్పడితే వేటు తప్పదు : జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ యాదయ్య

కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే వేటు తప్పదన్నారు జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌.యాదయ్య. ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు అవగాహన తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని కళాశాలల్లో తప్పనిసరిగా వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు యాదయ్య. వసతిగృహాల్లో, విద్యాసంస్థల ఆవరణలో సీనియర్లు వేధింపులకు పాల్పడకుండా ఉండేలా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు అవగాహన తరగతులను జేఎన్‌టీయూకు అనుబంధంగా ఉన్న అన్ని కళాశాలలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు యాదయ్య. బాధితులు నేరుగా 1800 180 5522 లేదా 1800 425 1288 సంఖ్యలకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Posted in Uncategorized

Latest Updates