ర్యాలీలతో  శ్రీరాముడికి చెడు పేరు తెస్తున్నారు: మమత

MAMATAపశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా నిర్వహించే ర్యాలీలతో శ్రీరాముడి పేరు తెస్తున్నారన్నారు. శ్రీరామ నవమి రోజు ర్యాలీల సందర్భంగా జరిగే మత ఘర్షణలపై సోమవారం(మార్చి-26) ఆమె మీడియాతో మాట్లాడారు. ఆయుధాలతో శోభాయాత్రలు జరపాలని దేవుడు ఎవరికైనా చెప్పారా అంటూ ఆమె ప్రశ్నించారు. కొంత మంది అవివేకులు ఆయుధాలతో ర్యాలీలు చేస్తూ దేవుడి పేరు చెడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతీయుతమైన ర్యాలీలకు మాత్రమే తాను అనుమతి ఇస్తానని, ఆయుధాలతో ఇతరుల ఇంట్లోకి వెళ్లి హత్యచేసే ర్యాలీలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతేడాది దుర్గ మాత శోభాయాత్ర, మొహర్రం పండుగలు ఒకే రోజున వచ్చినప్పుడు కూడా సీఎం మమతా బెనర్జీ చాకచక్యంగా వ్యవహరించి మత ఘర్షణలు జరగకుండా జగ్రత్తలు తీసుకున్నారు. మన దేశంలో సాధారణంగా సిక్కు మతస్థులు ఆయుధాలతో ర్యాలీలు నిర్వహిస్తుంటారు. అయితే మత పరమైన ర్యాలీలలో కత్తులు, తుపాకులతో ప్రదర్శనలు నిర్వహించడం చట్టరీత్యా నేరం.

 

 

 

Posted in Uncategorized

Latest Updates