ర‌ష్యా ఓపెన్‌: ఫైనల్ కి చేరిన సౌరబ్ వర్మ 

రష్యా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ఆటగాడు సౌరభ్‌ వర్మ ఫైనల్లోకి ఎంటరయ్యాడు. సెమీఫైనల్లో మరో భారత ఆటగాడు మిథున్‌ మంజునాథ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు సౌరభ్‌. 31 నిమిషాల్లో రెండు వరుస సెట్లలో 21-9, 21-15తో మ్యాచ్‌ను సొంతం చేసుకున్న సౌరభ్ ఆదివారం(జూలై-29) జరిగే ఫైనల్లో జపాన్‌ క్రీడాకారుడు కోకి వటనబేతో తలపడనున్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ భారత జోడీ రోహన్‌ కపూర్‌- కుహూ గార్గ్‌ ఫైనల్లో అడుగుపెట్టింది.

 

Posted in Uncategorized

Latest Updates