లంచం తీసుకుంటూ దొరికిపోయిన వరంగల్ ఆర్ అండ్ బి ఏఈ

warangal60 వేలు లంచం తీసుకుంటున్న వరంగల్ అర్ అండ్ బీ ఏఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అతని నుంచి నగదును స్వాధీనం చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. తిరుపతి అనే కాంట్రాక్టర్ హన్మకొండలోని పెద్దమ్మ గడ్డ రోడ్డు పక్కన బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ దక్కించుకుని ఏడాదిలోగా నిర్మించారు. అయతే దానికి సంబంధించిన బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగారు తిరుపతి. అయితే తనకు పర్సెంటేజీ ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని ఏఈ చెప్పడంతో… ఏసీబీనీ ఆశ్రయించాడు. అడ్వాన్స్ గా 60 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates