లండన్ కు పెద్ద పెద్ద ఐస్ ముక్కలొచ్చాయ్.. ఎందుకో తెలుసా..?

గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి వార్నింగ్ బెల్స్ మోగిస్తూనే ఉంది. ఐతే… దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు మాత్రం అంతంతమాత్రమే. స్వచ్ఛంద సంస్థలు… పర్యావరణ ప్రేమికులు మాత్రం గ్లోబల్ వార్మింగ్ మానవాళికి ఎంత హానిచేస్తుందో అవగాహన కల్పిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ గురించి తమదైన స్టైల్ లో వినూత్న ప్రదర్శనలు ఇస్తున్నారు.

భూతాపం పెరిగిపోవడం వల్ల ఆర్కిటక్ లో ఐస్ కరిగిపోతోందని… లండన్ వాసులకు సరికొత్తగా వివరించారు ప్రఖ్యాత ఆర్టిస్ట్ ఒలాపుర్ ఎలియాసన్. గ్రీన్ ల్యాండ్ నుంచి మంచు కొండ ముక్కలను భారీ షిప్పుల్లో .. ఐస్ షీట్స్ పై పెట్టి లండన్ నగరానికి తీసుకొచ్చారు. 1.5 టన్ను నుంచి… 5 టన్నుల బరువున్న వీటిని.. క్రేన్ల సాయంతో లండన్ బ్లూంబర్గ్ సముదాయం ముందు ఉంచారు. “ఐస్ వాచ్” అని పిలుపునిస్తూ…… ప్రతి ఒక్కరు ఆ మంచు గుట్టలను గమనించాలని కోరారు ఒలాఫుర్ ఎలియాసన్. వాటితో మాట్లాడాలని.. అవి చేసే చప్పుడు వినాలని కోరారు. వేడికి ఆ మంచు గుట్టలు కరిగిపోయి.. నీటి చెలిమె కుప్పలుగా మారడాన్ని గమనించాలన్నారు. కేవలం వారం రోజుల్లోనే అవి అక్కడ కనిపించకుండా పోయాయి.

ఇలా.. బ్రిటన్ లోని నగరాల్లో… లండన్ మహానగరంలో.. పదిరోజులకు ఒకచోట ప్రదర్శన ఇస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ మంచును ఎలా కరిగిస్తుందో ప్రత్యక్షంగా తెల్సుకోండి అంటూ కష్టాలకు ఓర్చి.. ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. యూకేలోని ఆర్ట్ గ్యాలరీ టేట్ మోడర్న్ ముందు కూడా ఈ ప్రదర్శన చేశారు. జనం నుంచి స్పందన కూడా పెరుగుతోంది.

Posted in Uncategorized

Latest Updates