లండన్ కోర్టు ఆదేశం : ఇండియాలోని జైలు వీడియో చూపించండి

9 వేల కోట్ల రూపాయల బ్యాంక్ లోన్ ఎగ్గొట్టి లండన్ కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించే అంశాన్ని ఈ రోజు లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు విచారించింది. విచారణ సందర్భంగా మాల్యాను ఉంచుదామనుకుంటున్న ముంబైలోని ఆర్ధర్ రోడ్డులోని జైల్ లోని సెల్ ఫోటోలను కోర్టుకి సమర్పించారు భారత అధికారులు. అయితే భారతదేశంలోని జైళ్లలో ఫ్రెష్ ఎయిర్ రాదని, గాలి, వెలుతురు రాదని విజయ్ మాల్యా తరపున లాయర్ క్లారీ మాంట్ గోమెరీ జడ్జి ఎమ్మా అర్బౌత్నాట్ కు తెలిపారు. కేవలం భారత అధికారులు సమర్పించిన జైలు ఫొటోలను చూసి తాను నిర్ణయం తీసుకోలేనని జడ్జి ఎమ్మా ఆర్బత్నాట్ తెలిపారు. భారత అధికారులు సమర్పించిన ఫొటోలో కనిపిస్తున్న డోర్ నుంచి ఎవరైనా జైలు లోనికి వెళ్లున్న మొత్తం వీడియో తీయాలని జడ్జి.. భారత అధికారులకు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో వీడియో తీయాలని,. సెల్‌ లోకి వెలుతురు, గాలి సరిగా వచ్చే వీలుందో లేదో చూడాలని జడ్జి అన్నారు. ఈ కేసులో మాల్యాకు మరికొంతకాలం బెయిల్ పొడిగించింది కోర్టు. తదుపరి విచారణను సెప్టెంబర్-12కు వాయిదా వేసింది. మంగళవారం జరిగిన విచారణకు తనయుడు సిద్దార్థ్‌తో కలిసి మాల్యా కోర్టుకు వచ్చారు.

విచారణ అనంతరం కోర్టు బయట మీడియాతో మాట్లాడిన మాల్యా…. తానేమీ క్షమాబిక్ష కోసం అప్లయి చేసుకోలేదని, బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను సెటిల్మెంట్ చేసేందుకు సిద్దమని తెలిపారు. బ్యాంకుల కంప్లెయింట్ తో ఆస్తులను అటాచ్ చేసిన తర్వాత తాను ఏమీ చేయలేనని, కోర్టు దీనిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates