లండన్ లో ఎమోషనల్ ఫేర్ వెల్ : పాక్ కు బయల్దేరిన షరీష్, మర్యం

అవినీతి ఆరోపణల కేసులో జైలు శిక్ష పడిన పాక్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్, ఆయన కూతురు మర్యం కొద్దిసేపటి క్రితం UAE లోని అబుదాబి ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. స్పెషల్ నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో(NAB) టీమ్ అబుదాబి ఎయిర్ పోర్ట్ లో షరీఫ్, అతని కూతురు మర్యం ను అరెస్ట్ చేసి పాక్ కు తీసుకెళ్తున్నారు. వారిని ఇస్లామాబాద్ లేదా లాహోర్ జైలుకి తరలించే అవకాశముంది.  అవినీతి ఆరోపణలు రావడంతో పాక్ అధ్యక్ష భాధ్యతల నుంచి తప్పుకొన్న షరీఫ్ తన కుటుంబసభ్యులతో కలిసి కొంతకాలంగా లండన్ లో ఉంటుంటున్నారు. అయితే షరీష్ పై అవినీతి ఆరోపణలు రుజువవడంతో నాలుగు రోజుల క్రితం పాకిస్ధాన్ సుప్రీం కోర్టు షరీఫ్ కు 7 ఏళ్ల జైలు శిక్ష, అవినీతిలో సంబంధం ఉన్న అతని కూతురికి, షరీష్ తమ్ముడికి కూడా జైలు శిక్ష విధించింది. దీంతో పాక్ కు బయల్దేరే మందు… గురువారం రాత్రి లండన్ లోని తన నివాసంలో మిత్రులు, బంధువులకు ఎమోషనల్ ఫేర్ వెల్ ఇచ్చాడు నవాజ్ షరీఫ్. ఈ ఫేర్ వెల్ పార్టీలో పాక్ మాజీ ఆర్ధికమంత్రి  నుంచి ఇషాక్ దర్ కూడా పాల్గొన్నారు. ఈ పార్టీ సమయంలో షరీష్, అతని కూతురు మర్యం బాగా ఎమోషనల్ అయ్యారు.

Posted in Uncategorized

Latest Updates