లండన్ లో ఘనంగా బోనాల జాతర

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో లండన్ లో బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈ వేడుకకు యూకే నలుమూలల నుంచి 800 మంది హాజరయ్యారు. అమ్మవారికి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి, లండన్ వీధుల్లో తొట్టెలను ఊరేగించారు. సాంస్కృతిక ప్రదర్శనలు స్థానికులను ఆకట్టుకున్నాయి. విదేశాల్లోనూ బోనాల పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు టాక్ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, కార్యదర్శి రవి రేతినేని, సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కుర్మాచలం. కార్యక్రమానికి స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, సెక్రటరీ ఆఫ్ ఇండియాన్ హైకమిషనర్ అనిమా భరద్వాజ్ ముఖ్యతిధులుగా హాజరయ్యారు.

Posted in Uncategorized

Latest Updates