లక్ష కోట్లకు IT ఎగుమతులు: మంత్రి కేటీఆర్

తెలంగాణలో యువతకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.IT ఫలాలు యువతకు అందించాలనే లక్ష్యంతోనే రాష్ట్రవ్యాప్తంగా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత. టూర్ లో భాగంగా దుబ్బాకలో IT హబ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఢిల్లీ, హైదరాబాద్‌లకే పరిమితం కాదని అన్ని ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ ఎగుమతులను రూ. లక్షా 20 వేల కోట్లకు తీసుకుపోవాలని లక్ష్యం పెట్టుకున్నామని… ఈ ఏడాది వరకు రూ. లక్ష కోట్లకు చేరుకున్నామన్నారు. రాబోయే సంవత్సరం తమ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. టీఎస్‌ఐపాస్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల ఉద్యోగాలు సృష్టించామని తెలిపారు. నిజామాబాద్‌ పట్టణానికి బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయిలు ఇచ్చామన్నారు మంత్రి కేటీఆర్.

రూ.25 కోట్ల ఖర్చుతో నిర్మించే IT హబ్‌లో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కోసం ప్రత్యేక గదులు, ఆడియో విజువల్ రూమ్, లెక్చరర్ హాల్, స్కిల్ డెవలప్‌మెంట్ క్లాస్‌రూమ్స్‌తో పాటు సమావేశపు గదులను నిర్మించనున్నారు.

విద్యార్హుల కోసమే ఐటీ హబ్‌ ఏర్పాటు చేస్తున్నాన్నారు ఎంపీ కవిత. ఉమ్మడి ఏపీలో ఐటీ రంగం హైదరాబాద్‌ వరకే పరిమితమైందన్నారు. ITని అన్ని జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తరిస్తోందన్నారు. ఐటీలో కొత్త ఆవిష్కరణలకు నిజామాబాద్‌ కేంద్రం కావాలన్నారు అంతేకాదు నిజామాబాద్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్‌ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు ఎంపీ కవిత.

Posted in Uncategorized

Latest Updates