లక్ష బ్యాంక్ జాబ్స్ వస్తున్నాయ్

ఢిల్లీ : ఉద్యోగాల విషయంలో బ్యాంకింగ్‌ రంగం ఎప్పటికీ ఆకర్షణీయమే! ఎన్ని ఉద్యోగాలు మన ముందున్నా …బ్యాంక్‌ లో ఉద్యోగం కొట్టాలని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. బ్యాంక్‌ జాబ్‌ కోసం కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ రేయింబవళ్లు కష్టపడతారు.డిజిటల్ ట్రాన్సఫర్మేషన్‌ పెరగడం, కొత్త బ్యాంకింగ్‌ విధానాలను అందిపుచ్చుకోవడంతో బ్యాంకుల్లోనూ భారీ కొలువులు వస్తున్నా యి. ఎస్‌ బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌ , సిండికేట్‌ బ్యాంక్‌ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ లు(పీఎస్‌ బీలు) ఈ ఏడాది లక్షమందిని నియమించుకు నే ప్రయత్నంలో ఉన్నాయని తాజా రిపోర్టు పేర్కొంది. పీఎస్‌ బీలు తమ నియామకాలను రెండింతలు చేసినట్టు జాతీయ మీడియా తెలిపింది. మొండిబకాయిలను రికవరీ చేసుకోవడం కోసం బాగా శ్రమిస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ల్లో తీవ్ర పోటీ నెలకొందని రిక్రూట్‌ మెం ట్‌ సంస్థ టీమ్‌ లీజ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్సియల్‌‌ సర్వీసెస్‌ బిజినెస్‌ హెడ్‌ సవ్యసాచి చక్రవర్తి అన్నారు . ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో హైరింగ్‌ అవుట్‌ లుక్‌ ఆకర్షణీయంగా ఉందని పేర్కొన్నారు .

గత రెండేళ్లలో కూడా ఈ బ్యాం క్‌ లు 95 వేల మందిని నియమించుకున్నట్టు ఈ రిక్రూట్‌ మెం ట్‌ సంస్థ అంచనా వేసింది. వారిలో క్లర్క్‌‌లు, మేనేజ్‌ మెం ట్‌ ట్రైనీలు, ప్రొబెషనరీ ఆఫీసర్లు ఉన్నారు . గత రెండేళ్ల నియామకానికి దాదాపు రెండింతలు చేస్తూ … ఈ ఏడాది లక్ష మంది ఉద్యోగులను పీఎస్‌ బీలు నియమించుకోబోతున్నాయి. ప్రస్తుతం పీఎస్‌ బీలు వెల్త్‌‌ మేనేజ్‌ మెం ట్‌ , అనాలిటిక్స్‌‌, స్ట్రాటజీ, డిజిటల్‌‌, కస్టమర్‌ సర్వీసెస్‌ వంటి ప్రత్యేక కార్యకాలపాలు నిర్వర్తించే వారి పై ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నా యి. పీఎస్‌ బీల వ్యాపారాలు వృద్ధి మార్గం లో ప్రయాణించేందుకు వారి కల్చర్‌ ను మార్చాల్సి వస్తుందని, ఇదే ప్రస్తు త నియామకాల ప్రక్రియలో కనిపిస్తుందని సవ్యసాచి అన్నారు . కొత్త బ్యాంకింగ్‌ విధానాలు, ప్రైవేట్‌ రంగ, బహుళ జాతీయ బ్యాంకులకు అనుగుణంగా హైరింగ్‌ టాలెంట్‌ పై బ్యాం క్‌ లు ఫోకస్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంక్‌ లు ఎక్కువగా ఆఫీసర్లను, క్లర్క్‌‌లను నియమించుకుం టున్నాయి. టీమ్‌ లీజ్ అంచనా ప్రకారం ఎస్‌ బీఐ మినహా, మిగతా పీఎస్‌ బీల్లో మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం క్లర్క్‌‌లే ఉన్నారు. కేవలం ఎస్‌ బీఐలోనే 45 శాతం మంది ఉద్యోగులు క్లర్కులే కావడం గమనార్హం.

పీఎస్‌ బీలు ప్రైవేట్‌ ప్లేయర్ల నుంచి కూడా టాలెంట్‌ ను హైర్‌ చేసుకుంటున్నా యి. ఈ డెవలప్‌ మెం ట్‌ తో చీఫ్‌ ఎథిక్స్‌‌ ఆఫీసర్‌ , చీఫ్‌ మార్కె టింగ్‌ ఆఫీసర్‌ , చీఫ్‌ ఇన్వెస్ట్‌‌మెం ట్‌ ఆఫీసర్‌ , చీఫ్‌ లెర్నిం గ్‌ ఆఫీసర్‌ , హెడ్‌ ఆఫ్‌ అనాలటిక్స్‌‌, డిజిటల్ మార్కె టింగ్‌ క్యాంపెయినర్‌ గా పనిచేస్తోన్న వారి వార్షిక వేతనం రూ.50 లక్షల దాకాఉంది. సిండికేట్‌ బ్యాంక్‌ ఈ ఏడాది ఇప్పటికే 500 మందిని నియమించుకుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా పోర్ట్‌ ‌ఫోలియో మేనేజ్‌ మెం ట్‌ సర్వీసెస్‌ అండ్‌ వెల్త్‌‌ మేనేజ్‌ మెంట్‌ డివిజన్లలో 500 మందిని నియమిస్తోం ది. మొండి బకాయిలు రికవరీ చేసేందుకు లీగల్‌‌ ప్రొఫిషినల్స్‌‌కు కూడా బ్యాంకుల్లో డిమాండ్‌ పెరుగుతోంది. ఫ్రెష్‌‌ హైరింగ్‌ మాత్రమే కాక, లేటరల్‌‌ హైర్స్‌‌(ఒక పోస్టులో కచ్చి తంగా నియమించాల్సిన నిపుణుడు) ద్వారా వచ్చే క్వార్టర్స్‌‌లో 5000 మందిని ఎస్‌ బీఐ నియమించబోతుందని టీమ్‌ లీజ్‌ రిపోర్టులో తెలిసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్‌‌ బ్యాంకింగ్‌ విపరీతంగాపెరిగింది. దీంతో నియామకాల స్థాయి ఎగిసింది.

Posted in Uncategorized

Latest Updates