లక్ అంటే ఇదే: క్యాబేజీ కోసం వెళ్లి కోటిన్నర గెలుచుకుంది

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు కొడుతుందో తెలియదు. అమెరికాలోని మేరీల్యాండ్ కు చెందిన ఓ మహిళకు ఇలానే అదృష్టం డోర్ కొట్టింది. గ్రోవ్‌టన్‌ సిటీకి చెందిన వెనెస్సా వార్డ్‌ కు ఆమె తండ్రి ఫోన్‌ చేసి క్యాబేజ్‌ తీసుకొని రమ్మని చెప్పడంతో ఆమె దగ్గర్లోని జైంట్‌ ఫుడ్‌ స్టోర్ కు వెళ్లింది. ఆ స్టోర్ లో లాటరీ టికెట్లు చూసిన ఆమె వెంటనే ఓ టికెట్ కొనేసింది.

ఇంటికెళ్లాక ఆ టికెట్‌ను స్ర్కాచ్‌ చేయగా.. అందులో ఆమె 2.25 లక్షల డాలర్లు(మన కరెన్సీలో రూ1.5 కోట్లు) గెలుచుకున్నట్లుగా ఉంది. దీంతో ఆమె సంతోషానికి హద్దే లేకుండా పోయింది. తను గెల్చుకున్న డబ్బును ఫ్యూచర్ లో రిటైర్మెంట్ అయ్యాక ఉపయోగించుకోవటంతో పాటు డిస్నీ వరల్డ్‌ చూసేందుకు వెళ్తానని వెనెస్సా తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates