లలితాదేవికి 365 చీరలతో ప్రత్యేక అలంకరణ

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో లలితాదేవికి 365 చీరలతో భక్తులు కన్నుల పండుగగా  అలంకరించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచీ ఒక చీరను అమ్మవారికి మహిళలు అలంకరించారు. అమ్మవారికి అలంకరించిన చీర ధరిస్తే శుభం కలుగుతుందని గ్రామస్తుల నమ్మకం. శివ పంచాయతన సమేత ఉమా రామలింగేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారిని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates