లవర్స్ డే టాప్ క్లిప్ : ముచ్చటపడి మళ్లీ మళ్లీ చూసేస్తున్నారు

oru-adaar-loveవాలంటైన్స్ డే.. ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికులకు వెరీ వెరీ స్పెషల్. ప్రపంచవ్యాప్తంగా లవర్స్ డే వీక్ నడుస్తోంది ఇప్పుడు. అన్నింటి కంటే ముఖ్యంగా.. ఓ సాంగ్ మాత్రం దేశాన్ని ఊపేస్తుంది. ముచ్చట పడి మళ్లీ మళ్లీ చూసేస్తున్నారు. హైస్కూల్ అబ్బాయి – అమ్మాయి కళ్లతోనే ఐ లవ్ యూ చెప్పే ఈ సన్నివేశం సోషల్ మీడియాలో దుమ్ము రేపేస్తుంది. వివరాల్లోకి వెళితే..

మళయాంలో ఓరు అదార్ లవ్ (our Adaar Love) సినిమా తెరకెక్కుతుంది. హైస్కూల్ లో జరిగే ఓ ప్రేమ కథ ఇది. మార్చి 3వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ మూవీకి సంధించి మాణిక్య మలరాయ పూవీ పేరుతో సాంగ్ రిలీజ్ అయ్యింది. అందులో హీరో – హీరోయిన్ మధ్య క్లాస్ రూంలో ఇద్దరి మధ్య జరిగే లవ్ ట్రాక్ ని అద్భుతంగా చిత్రీకరించారు. మాటలు ఉండవు. హీరో – హీరోయిన్ కనురెప్పలు ఎగరేయటం.. కన్ను కొట్టటం చూసినోళ్లు.. మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ముచ్చటగా ఉందంటూ అందరికీ షేర్లు చేస్తున్నారు. జస్ట్ 72 గంటల్లో సాంగ్ కు 50లక్షల వ్యూస్ వస్తే.. వారి హావభావాలతో ఉన్న 26 సెకన్ల క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ముదుమారం అయ్యింది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో అతి కొద్ది సమయంలో.. ఎక్కువ షేర్లు అయిన క్లిప్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. వాలెంటైన్స్ డే వీక్ నడుస్తుండటంతో.. ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఓ మళయాళ మూవీలోని 26 సెకన్ల క్లిప్.. వాల్డ్ వైడ్ గా ఉన్న ప్రేమజంటలు తమ ఫోన్లలో స్టేటస్ గా పెట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates