లవర్ ట్రైలర్ : నచ్చిన అమ్మాయిని చూడగానే..ఒంట్లో ఓల్టేజ్ పుడుతుంది

అన్నిష్ డైరెక్షన్ లో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న సినిమా లవర్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను శనివారం (జూలై-14) ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. నిమిషం 48 సెకన్లున్న ఈ లవర్‌ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఎవడికో నచ్చిన బైకు నాకెందుకు నచ్చుతుంది నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా అది బైకవని, లైఫ్ అవని అనే డైలాగ్ బాగుంది. ఒక్కొక్కరికి ఒక్కొ అమ్మాయిని చూసినప్పుడు ఒంట్లో ఓల్టేజ్ పుడుతుందంటాడు రాజ్ తరుణ్. మనం ఈ లోకంలో లేకపోయినా మనల్సి ఎవరైనా తలుచుకున్నారంటే మన జీవితానికి అర్థం వచ్చినట్లేనని చివర్లో హీరోయిన్ డైలాగ్ ఉంటుంది. రాజ్ తరుణ్ సరసన రిధి కుమార్‌ హీరోయిన్ గా నటించింది. ఇద్దరి కెమిస్ట్రీ కుదిరింది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు బాగున్నాయి. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కిన ఈ మూవీలో భారీ యాక్షన్‌ సన్నివేశాలతో రాజ్‌ తరుణ్‌ కొత్త లుక్‌ లో కనిపిస్తున్నాడు. ఈ మూవీ జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Posted in Uncategorized

Latest Updates