లవర్ ను ముక్కలుగా నరికి ..రెండు బ్యాగుల్లో పెట్టాడు

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. కత్తితో పొడిచి చంపిన తర్వాత.. ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి, రెండు బ్యాగుల్లో పెట్టాడు. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది. ఆ బ్యాగులు ఓ డ్రైనేజీలో దొరకడంతో.. ఈ కేసును చేధించారు పోలీసులు. బారాపుల్లా ఫ్లైఓవ‌ర్‌ కింద ఉన్న డ్రైనేజీలో మైనర్ అమ్మాయి డెడ్ బాడీతో ఉన్న బ్యాగులు దొరికాయి. ఈ హత్య కేసులో నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన రిజ్వాన్ ఖాన్‌ ను అరెస్టు చేశారు.

11 నెలల నుంచి ఇద్దరి మధ్య పరిచయం ఉంది. అయితే ఇటీవల ఆ అమ్మాయి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు గ్రహించాడు రిజ్వాన్. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో కత్తితో గర్ల్‌ ఫ్రెండ్‌ పై రిజ్వాన్ దాడి చేశాడు. ఆమె స్పాట్ లోనే చనిపోవడంతో డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేసి రెండు బ్యాగుల్లో నింపి..డ్రైనేజీలో పడేసినట్లు విచారణలో తెలిందని తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు శవాన్ని వెలికితీసి పోస్ట్‌ మార్టం కోసం హస్పిటల్ కి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates