లవ్ ఫెయిల్ : హుస్సేన్ సాగర్ లో దూకిన యువతి

hussainsagar0902 ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నది యువతి. అందులో భాగంగా ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం ఆ యువతి ట్యాంక్ బండ్ దగ్గరకి వచ్చింది. హుస్సేన్ సాగర్‌లో దూకింది. దీన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు.. ఆమెను కాపాడటం కోసం సాగర్ లో దూకారు. యువతిని కాపాడి ట్యాంక్ బండ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు.

ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు యువతి పోలీసులకు తెలిపింది. యువతి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవటం తప్పని చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates