లాంగ్‌ రైల్‌ రోడ్‌ బ్రిడ్జి: 25న ప్రారంభించనున్న ప్రధాని

 

 

 

 

దేశంలోనే అతి పొడవైన రైల్‌ రోడ్‌ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (డిసెంబర్-25) ప్రారంభించనున్నారు. అసోంలోని టిన్సుకియా నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నహర్లాగన్‌ పట్టణానికి రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే 15 గంటల 20 నిమిషాలు పడుతుంది. బోగిబీల్‌ బ్రిడ్జీని కట్టడంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 10 గంటలు తగ్గుతుంది. బ్రహ్మపుత్ర నదిపై దాదాపు 4.9 కిలోమీటర్ల వరకు బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి ద్వారా మొదటి సారిగా పాసింజర్‌ ట్రైన్‌ ప్రయాణించనుంది. ఈ నెల 25న అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధాని మోడీ బ్రిడ్జినుంచి రాకపోకలు ప్రారంభిస్తారు.

 

Posted in Uncategorized

Latest Updates