లాంఛ్ అయిన అఖిల్ మూడో సినిమా..క్లాప్ కొట్టిన నాగ్

Akhil-Third-Movieఅక్కినేని అఖిల్‌ మూడో సినిమా  అధికారికంగా లాంఛ్‌ అయ్యింది. తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఈ మూవీ రూపొందనుంది. సీనియర్‌ హీరో, అఖిల్‌ తండ్రి నాగార్జున అక్కినేని ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టగా.. మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశాడు.

థమన్‌ మ్యూజిక్‌ అందించబోతున్న ఈ చిత్రానికి జార్జ్‌ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర(ఎస్‌వీఎస్‌సీ) బ్యానర్‌లో  బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Posted in Uncategorized

Latest Updates