లాకర్లు చూసి కళ్లుతిరిగాయ్ : పురుషోత్తం డైమండ్ అండ్ జ్యువెలరీస్

gold purshotamపురుషోత్తంరెడ్డి. అక్రమ ఆస్తులు, బినామీ ఆస్తుల వ్యవహారాల్లో 10 రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం అయ్యారు. ఇప్పటికే 350 కోట్ల రూపాయల వరకు గుర్తించినట్లు ఓ అంచనా. బిల్డింగ్స్, స్థలాలు, పొలాలు ఇలా కోట్లకు కోట్ల ఆస్తులు బయట పడటంతో అందరూ షాక్ అవుతున్నారు. HMDA డైరెక్టర్ గా పని చేసిన పురుషోత్తం రెడ్డి.. ఎట్టకేలకు ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ఈ క్రమంలోనే అతనికి సంబంధించిన బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేస్తున్నారు అధికారులు.

పురుషోత్తంరెడ్డి అత్త పేరుపై బ్యాంక్ లాకర్స్ ఉన్నాయి. వీటిని ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం ఓపెన్ చేశారు ఏసీబీ అధికారులు. అంతే కళ్లు తిరిగాయ్. డైమండ్స్ పొదిగిన నక్సెస్ లు, గొలుసులు, పెద్ద మొత్తంలో ఉన్నాయి. డైమండ్స్ తో మాత్రమే చేసిన రెండు పెద్ద హారాలు లైటింగ్ వెలుగులో మెరుస్తుంటం ఆశ్చర్యం. ఒక్కో డైమండ్ నక్లెస్ విలువ కనీసంలో కనీసం రెండు, మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఓ డైమండ్ నక్లెస్ మధ్యలో చాలా చాలా అరుదుగా, అత్యంత ఖరీదైన పచ్చ వజ్రం ఉండటం షాక్ కు గురి చేసింది. మరో నక్లెస్ హారంలో బ్రౌన్ కలర్ వజ్రం ఉంది. లాకర్లలో ఉన్న వీటి విలువ కోట్లలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీటితోపాటు బంగారు ఆభరణాలు పెద్దఎత్తున లభించాయి.

Posted in Uncategorized

Latest Updates