లాక్ డౌన్ ఎఫెక్ట్: తగ్గనున్న టోల్ వసూళ్లు

హైదరాబాద్: కరోనా కారణంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ తో ఇంటర్, ఇంటర్ స్టేట్ ట్రాఫిక్ ను పరిమితం చేయడం వల్ల సమీప కాలంలో నిధులు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ మేరకు ‘టేకింగ్ టూ టోల్’ పేరుతో క్రిసిల్ రీసెర్చ్ వెలువరించిన రిపోర్టులో ఈ విషయాలు బయటపడ్డాయి. ఎసెన్షియల్ సర్వీసులు, టోల్ కలెక్షన్లు, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ (బీవోటీ) హైవే ప్రాజెక్టులతోపాటు పబ్లిక్ ఫండెండ్ ప్రాజెక్టుల నుంచి వచ్చే డబ్బులు త్వరలో ఆగిపోనున్నాయని నివేదిక చెప్తోంది.

లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్స్ సెక్టార్ కు నోడల్ ఏజెన్సీ అయిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) ఏప్రిల్ 20 వరకు టోల్ కలెక్షన్లు నిలిపేసింది. అయితే ఆ తర్వాత టోల్ ఫీజులను కలెక్ట్ చేస్తున్నప్పటికీ వాటిలో అంతగా పురోగతి లేదు. ఇది క్రమంగా సాధారణ స్థితికి వస్తుందని సమాచారం. పర్యవసానంగా ఇప్పటికే ఉన్న రహదారుల నుంచి టోల్ వసూలు, చెల్లింపులు 13 శాతం తగ్గనున్నాయి. లాక్ డౌన్ ను మరింత కాలం కొనసాగిస్తే క్షీణత 17 శాతంగా ఉండే ప్రమాదం ఉంది. కొత్త రహదారుల నిర్మాణంపై కూడా దీని ప్రభావం పడనుందని రిపోర్ట్ పేర్కొంది.

Latest Updates