లాయర్ల పనితీరు మెరుగు పడాలి : సీజేఐ గోగొయ్

దేశంలోని ప్రతి న్యాయవాది తమ పని తీరును మెరుగు పర్చుకోవాలని సూచించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్. లాయర్ల పనితీరు సరిగా లేకపోవడంతో అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య పెరిగిపోతుందన్నారు. దేశంలో 67 శాతం మంది అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారని చెప్పారు సీజేఐ. ఈ అండర్ ట్రయల్స్‌లో 47 శాతం మంది 18-30 సంవత్సరాల వయసున్న వారు ఉన్నారని తెలిపారు. లాయర్ల పనితీరు మెరుగ్గా ఉంటే అండర్ ట్రయల్స్ ఖైదీల సంఖ్య తగ్గుతుందన్నారు. న్యాయవ్యవస్థ ఒక పెద్ద సబ్జెక్టు అని , మనదేశంలో 14 లక్షల మంది న్యాయవాదులున్నారని ఆయన తెలిపారు. యూఎస్‌లో ప్రతి 200 మందికి ఒక లాయర్ ఉంటే… మన దేశంలో ప్రతి 1800 మందికి ఒక న్యాయవాది ఉన్నారని తెలిపారు. లాయర్ల సంఖ్య పెరగాల్సి ఉందన్నారు రంజన్ గోగోయ్.

Posted in Uncategorized

Latest Updates