లాయర్ ధీమా ఇది : 2జీ లాగే నీరవ్ మోడీ కేసు కూడా తుస్సే

1519050744-choksniravరూ.11 వేల 400 కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వ్యవహారంపై.. ఆయన లాయర్ విజయ్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీరవ్ మోదీపై నమోదైన కేసు కూడా బోఫోర్స్, 2జీ కేసుల మాదిరిగానే కోర్టు ముందు కుప్పకూలక తప్పదన్నారు. ఇప్పటికే టెలికం కుంభకోణం సహా పలు హై-ప్రొఫైల్ నిందితుల తరపున వాదించి నెగ్గిన అగర్వాల్.. PNB స్కాం కేసులో నీరవ్ మోదీ తరపున వాదించనున్న సంగతి తెలిసిందే.

PNB కేసులో తెలిపినట్టు తన క్లయింట్ ఎలాంటి నేరానికి పాల్పడలేదన్నారు. నీరవ్ మోడీపై వస్తున్న ఆరోపణలన్నీ తప్పుడవే అన్నారు. ఒకవేళ మోడీ మోసానికి పాల్పడితే.. రూ.5వేల 600 కోట్ల విలువైన ఆస్తులను ఎందుకు వదిలేస్తారని ప్రశ్నించారు. వాటిని ఇప్పటికే ED స్వాధీనం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మోసం చేసి పారిపోవాలని నీరవ్ మోడీ భావిస్తే.. విజయ్ మాల్యాలాగే అన్నీ పట్టుకుని వెళ్లిపోయేవారన్నారు. రూ.5,600 కోట్ల విలువైన వజ్రాలు, నగలు దేశంలోనే ఎందుకు వదిలి వెళ్లినట్టు.. అని అగర్వాల్ ప్రశ్నించారు. తన క్లయింట్పై వచ్చిన ఆరోపణలన్నీ విచారణ సందర్భంగా కొట్టుకుపోతాయన్నారు మోదీ లాయర్ విజయ్ అగర్వాల్ దీమా వ్యక్తం చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates