లారీల సమ్మె : వరంగల్ లో భారీగా నిలిచిపోయిన సరుకుల రవాణా

తెలంగాణ రాష్ట్రంలో లారీల సమ్మె కొనసాగుతోంది. దీంతో లారీలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. సమ్మె ఎఫెక్ట్ తో వరంగల్ రైల్వే స్టేషన్ లో 3వేల టన్నుల ఎరువులు రైల్వే వ్యాగిన్ లోనే ఉండిపోయాయి. దీంతో ఎరువులు అందక రైతులు, పని దొరక్క హామాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ లారీ యజమానులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఆలిండియా, తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వరంగల్‌ జిల్లా, వరంగల్‌ లోకల్, ఓరుగల్లు లోకల్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమ్మె ఉధృతం చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. నిత్యావసరాల సరుకుల తప్పా సిమెంట్, ఐరన్, బొగ్గు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణా నిలిచిపోయింది. జిల్లాలో 3వేల లారీలు నిలిచిపోగా ఇతర రాష్ట్రాలకు చెందిన 4 వేల లారీలు సరుకులతోనే రహదారులపై నిలిచిపోయాయి. తరచూ పన్నులను పెంచుతున్న కారణంగా వాహనాలను నడపలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates