లారీ-బొలెరో ఢీ…10 మంది యాత్రికులు మృతి

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ(అక్టోబర్-17) ఉదయం నువాపడా-కరీయార్ ప్రధాన రహదారిపై సిల్దా గ్రామ సమీపంలో లారీ, బొలెరో వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి.  ప్రమాదంలో బొలెరో డ్రైవర్‌ సహా 10 మంది చనిపోయారు. వీరందరూ ఛత్తీస్‌గఢ్‌ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం(అక్టోబర్-16) వీరందరూ కోమ్నాలోని వైష్ణవి దేవి మందిరానికి వెళ్లారు. స్వస్థలానికి తిరిగి వెళ్తుండగా ఇవాళ ఈ ప్రమాదం జరిగింది.

Posted in Uncategorized

Latest Updates