లార్డ్స్ వన్డే : టీమిండియా టార్గెట్-323

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శనివారం (జూలై-14) లార్డ్ వేదికగా భారత్ తో జరుగుతున్న సెకండ్ వన్డే మ్యాచ్ లో ఇంగ్లాడ్ బిగ్ స్కోర్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఓపెనర్స్ విరుచుకుపడటంతో ఇంగ్లాండ్ కు మంచి ప్రారంభం లభించింది.

ఆ తర్వాత భారత బౌలర్ ..కుల్దీప్ యాదవ్ మొదటి వికెట్ తీసి, ఇంగ్లాడ్ దూకుడుకు బ్రేక్ వేశాడు. ఆ తర్వాత వచ్చిన రూట్, మోర్గాన్ స్టాండెడ్ గా నలిబడటంతో ఇంగ్లాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. రూట్(113 నాటౌట్) సెంచరీతో చెలరేగగా..డేవిడ్ విల్లే(50) హాఫ్ సెంచరీతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
భారత బౌలర్లలో ..కుల్దీప్ యావ్ (3), పాండ్యా(1), ఉమేశ్ యాదవ్ (1), చాహల్(1) వికెట్లు తీశారు.

Posted in Uncategorized

Latest Updates