లాలు జైలుకెళ్లడానికి ఈమే కారణమట

తన శాపం ఫలితమే బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కి జైలు శిక్ష అని తెలిపింది షబ్నం మౌసీ బనో. తన పట్ల లాలు ప్రవర్తించిన తీరు కారణంగానే ఆయనకు ఇప్పుడు దేవుడు శిక్ష విధించాడని షబ్నం తెలిపింది. దాణా కుంభకోణం కేసులో లాలు జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
హిజ్రాలకు 1994 నుంచే ఓటింగ్ హక్కుని కల్పించింది భారత ప్రభుత్వం. మనదేశంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ట్రాన్స్ జెండర్(హిజ్రా) షబ్నం మౌసీ బనో. 1998 నుంచి 2003 వరకూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షహ్ డల్-అనుప్పూర్ జిల్లాలోని సొహగ్ పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు షబ్నం మౌసీ బనో. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న షబ్నం….. త్వరలో మధ్యప్రదేశ్‌లో జరగబోయో అసెంబ్లీ ఎలక్షన్లలో కొట్మా నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. గతంలో షబ్నం కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ……. ఆమె అభ్యర్ధనను కాంగ్రెస్ తిరస్కరించింది. దేశంలో గొప్ప చరిత్ర కలిగిన పురాతన పార్టీగా పేరున్న కాంగ్రెస్‌ పార్టీ తన పట్ల చాలా అమర్యదగా ప్రవర్తించిందని, ఇది కేవలం తన ఒక్కదానికి జరిగిన అవమానం కాదని, మొత్తం ట్రాన్స్ జెండర్ సామాజిక వర్గానికి జరిగిన అవమానంగా భావిస్తున్నానని షబ్నం తెలిపారు.
అయితే తనకు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమని, అవకాశం ఇస్తే కాంగ్రెస్‌ నుంచి పోటీకి సిద్దమని, కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని షబ్నం తెలిపారు. బీజేపీతో మాత్రం కలిసే ప్రసక్తే లేదని తేల్చి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates