లాలూకు నో బెయిల్

laluదాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖాండ్ హైకోర్టులో కోర్టులో శుక్రవారం(ఫిబ్రవరి-23) చుక్కెదురైంది. ఇప్పటికే ఇదే కుంభకోణానికి సంబంధించి రెండు కేసుల్లో శిక్ష ఖరారై జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ …డియాగఢ్ ట్రజరీ నుంచి అక్రమంగా నిధులు డ్రా చేసిన కేసులో బెయిలు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.

దాణా కుంభకోణానికి సంబంధించి డియోగఢ్ ట్రెజరీ నుంచి రూ.89.72 లక్షలు అక్రమంగా విత్‌డ్రా చేసుకున్న కేసులో లాలూ గతేడాది డిసెంబర్ 23 నుంచి రాంచీలోని బిర్సా ముండా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటికీ లాలూకు 2013, 2017, 2018లో దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలడంతో వరుసగా, ఐదు, మూడున్నరేళ్లు, ఐదేళ్ల జైలుశిక్ష పడింది.

Posted in Uncategorized

Latest Updates