లాలూ పుత్రరత్నం మాట : నా బంగ్లాలోకి దెయ్యాలు వదిలారు

tej prathap yadav

నేను ఉంటున్న ఇంట్లోకి దెయ్యాలు వదిలారు.. అందుకే భయంతో ఖాళీ చేస్తున్నాను. ఇంట్లోకి దెయ్యాలు వదిలింది ఎవరో తెలుసా.. సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం సుశీల్ మోడీలు అంటూ వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు బీహార్ మాజీ సీఎం కుమారుడు, మాజీ మంత్రి లాలూ తేజ్ ప్రతాప్ యాదవ్. ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు పాట్నాలోని దేశ్‌రత్నా మార్గ్‌లో ఆయనకు ప్రభుత్వం ఓ ఇంటిని కేటాయించింది. ఇన్నాళ్లు ఖాళీ చేయటానికి ససేమిరా అన్న తేజ్ ప్రతాప్.. ఇప్పుడు ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించి.. ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంటిని ఖాళీ చేయాలంటూ ఆరు నెలలుగా ప్రభుత్వం నోటీసులు పంపిస్తూ ఉంది. అయినా వినని తేజ్ ప్రతాప్.. కోర్టులో పిటీషన్లు పడటంతో ఎట్టకేలకు దిగివచ్చాడు. ఖాళీ చేస్తూ దెయ్యాల కొంప అంటూ విమర్శలు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం నా బంగ్లాలోకి దెయ్యాలు వదిలారు అంటూ విమర్శలు చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates