లావోస్ లో కుప్పకూలిన డ్యామ్ : మునిగిన ఊళ్లు.. వేలాది మంది గల్లంతు

థాయిలాండ్ పొరుగునే ఉన్న రిపబ్లిక్ కంట్రీ లావోస్ లో నిర్మాణంలో ఉన్న హైడ్రో పవర్ డ్యామ్ కుప్పకూలింది. అటాపీ ప్రావిన్స్ లోని ఆరు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. వేలమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానిస్తున్నారు. వందలాది మంది గల్లంతయ్యారు. నీళ్లదాటికి చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. 6వేల మంది నిర్వాసితులయ్యారు. వరద నీటిలో చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో డ్యామ్ లోకి అధిక నీరు వచ్చి చేరడంతో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. డ్యామ్‌ కుప్పకూలిన సమయంలో ఒక్కసారిగా 500 కోట్ల క్యూబిక్‌ మీటర్ల నీరు కింద ఉన్న జనావాస ప్రాంతాలపై విరుచుకుపడింది. ఆరు గ్రామాలు వరద ధాటికి తుడిచిపెట్టుకు పోయాయని.. ఈ ఘటనలో మృతులు అంచనాకు మించి ఉండొచ్చని తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates