లాసెట్ ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ షురూ…

రాష్ట్రంలోని లా(న్యాయవిద్య) కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 25న నిర్వహించనున్న లాసెట్ ప్రవేశపరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుంతో మే 23 వరకు గడువు విధించినట్టు తెలిపారు టీఎస్ లాసెట్-2018 కన్వీనర్ ద్వారకానాథ్ . దరఖాస్తులలోని తప్పులను సవరించుకొనేందుకు మే 17 నుంచి 20 వరకు అవకాశం ఉంది. మే 22 నుంచి టీఎస్ లాసెట్ ఆన్‌లైన్ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. మే 28న ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్ 10న ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించింది లాసెట్ కమిటీ. అదేవిధంగా టీఎస్ పీజీలాసెట్-2018ను కూడా మే 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. లాసెట్ నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటుచేశారు. వాటిలో హైదరాబాద్ వెస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ సౌత్‌ఈస్ట్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్ కేంద్రాలు ఉన్నాయి. వీటితోపాటు ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులోనూ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటుచేశారు. వివరాలకోసం www.lawcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

Posted in Uncategorized

Latest Updates