లాస్ట్ ఛాన్స్ : ఇవాళ్టి నుంచి LRS మేళా

hmdaLRS ( లిబరైజ్ డ్ రెమిటెన్స్ స్కీమ్) దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది HMDA.  ఈ రోజు ఫిబ్రవరి 26 నుంచి- 28 వరకు జోనల్‌ కార్యాలయాల్లో స్పెషల్ LRS మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు  అధికారులు. LRS ప్రక్రియను ఫిబ్రవరి- 28లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు వినియోగించుకోవాలని కోరారు. దీంతో 25 వేల దరఖాస్తుదారులపై ఈ ప్రభావం పడనుంది. పర్మీషన్ లేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం అవకాశం ఇవ్వగా.. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. HMDAకు 1.7 లక్షల దరఖాస్తులు అందాయని తెలిపారు అదికారులు. రెండేళ్ల కిందట LRS దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం విధించిన గడువు(ఈ నెల 28)లోపు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామ్ననారు.

Posted in Uncategorized

Latest Updates