లింగంపల్లి వరకు జన్మభూమి ఎక్స్ ప్రెస్

విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను లింగంపల్లి దాకా నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఏప్రిల్ 14 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే చెప్పింది. ఇప్పటిదాకా లింగంపల్లి,చందానగర్,హైటెక్ సిటీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఎక్కాలంటే సికింద్రాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది.  ఈ నిర్ణయంతో ఇకపై వారికి ఆ బాధ తప్పనుంది. ఇప్పటికే గౌతమి, కొకనాడ,నారాయణాద్రి విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను లింగంపల్లి వరకు పొడిగించారు.

ఏప్రిల్ 14 నుంచి జన్మభూమి ఎక్స్ ప్రెస్(ట్రైన్ నెం.12805) ఉదయం 6.15 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి సాయంత్రం 6.45 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 6.55కి బయల్దేరి బేగంపేటకు 7.09కు,లింగంపల్లికి రాత్రి 7.40కి చేరుకుంటుంది. అదే ట్రైన్ 12806 నంబర్ తో ఏప్రిల్‌ 15 నుంచి లింగంపల్లిలో ఉదయం 6.15కి బయల్దేరి బేగంపేటకు 6.38కి, సికింద్రాబాద్‌కు 7 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 7.10కి బయల్దేరి అదే రోజు రాత్రి 7.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

Posted in Uncategorized

Latest Updates