లీడ్స్ వన్డే : ఇంగ్లాండ్ టార్గెట్-257

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మంగళవారం (జూలై-17) లీడ్స్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత్..నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాకు..ప్రారంభంలోనే చుక్కెదురైంది. రోహిత్(2) ఓట్ కావడంతో స్లో రన్ రేట్ నమోదైంది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ (71) ధావన్(44) చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే 18 ఓవర్లో ధావన్ రనౌట్ కావడంతో, వెంటనే దినేష్, కోహ్లీ ఔట్ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్. చివర్లో శార్దూల్ ఠాకూర్ రెండు సిక్సులతో చెలరేగడంతో భారత్ కు గౌరవ ప్రదమైన స్కోర్ లభించింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో రషీద్ (3), డేవిడ్ విల్లే (3) వికెట్లు తీశారు.

Posted in Uncategorized

Latest Updates