లుక్స్ అదిరిపోయాయి : సైరా నరసింహారెడ్డి లుక్స్ లీక్ చేసిన బిగ్ బి

sairaమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151 వ సినిమా సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి ఈ ప్రతిష్ఠాత్మక సినిమాను డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి గురువుగా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఈ సినిమా షూటింగులో పాల్గొనేందుకు మంగళవారం (మార్చి 27) సాయంత్రం హైదరాబాద్ వచ్చారు బిగ్ బి. షూటింగ్‌ లో పాల్గొన్న విషయాన్ని బిగ్ బి ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేస్తూ.. తన లుక్‌ను లీక్‌ను చేసిన అమితాబ్ గురువారం(మార్చి29) మెగాస్టార్ తో కలసి పనిచేయడం గౌరవం అని తెలుగులో ట్వీట్ చేసి అదిరిపోయే చిరు లుక్స్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చిరంజీవి, నయనతారత కలసి ఓ యజ్ఞం నిర్వహిస్తున్న చిరంజీవి లుక్స్ అమితాబ్ పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో వీరి పక్కనే అమితాబ్ కూర్చొని ఈ కార్యాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చిరు నమ్మిన బంటుగా బ్రహ్మాజీ అక్కడ నిలబడి ఉన్నాడు. వందలాది మంది ప్రజలు దాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. అదిరిపోయే క్యాస్టూమ్స్‌తో చిరు, నయన్ ల లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి.
saira2

Posted in Uncategorized

Latest Updates