లూకేఫ్: విలాస వంతమైన టాయిలెట్

loo
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభత్వం. ఇందులో భాగంగా లేటెస్ట్ టెక్నాలజీ బస్ షెల్టర్లను GHMC ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ఏసీ,వైఫై,ఏటీఎం, సీసీ టీవీ, మొబైల్ చార్జింగ్, లాయిలెట్లు ఉండేలా ఆధునిక బస్ షెల్టర్లలో ఏర్పాటు చేస్తున్నారు.  పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్ ను మంగళవారం(మే-22) మంత్రి కేటీఆర్  శిల్పారామం దగ్గర ప్రారంభించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 826 లేటెస్ట్ బస్ షెల్టర్లను నాలుగు ప్యాకేజీల్లో నిర్మిస్తోంది GHMC.

బస్ షెల్టర్ ప్రత్యేకతలు:

… నిర్మాణ మొత్తం విస్తీర్ణం 170 చదరపు అడుగులు. అందులో 35 చ.అడుగుల్లో కెఫెటేరియా,15 చ. అడుగుల్లో ఏటీఎం ఉన్నాయి

…కెఫెటేయారిలో రూ.30కు మించకుండా ఫుడ్ ఐటమ్స్, టీ,కాఫీ,శాండ్ విచ్, ఆప్లెట్ లాంటి పదార్థాలు లభిస్తాయి.

… లాయిలెట్ చుట్టూ ఫ్రీ వైఫై

…మహిళలకు ఉచిత నాప్ కిన్లు

…మొబైల్ ఛార్జింగ్ సదుపాయం

…పర్యావరణహిత పదార్థంతో నిర్మాణం తయారీ

… దివ్యాంగులు, మహిళ,పురుషులకు వేర్వేరుగా రెండు టాయిలెట్లు, మరుగుదొడ్లు

…రాత్రి సమయాల్లో మనుషులను స్పష్టంగా గుర్తించే సీసీ కెమెరాలు,ముఖాలను గుర్తించే ఆధునిక సాప్ట్ వేర్ తో వాటి  అను సంధానం

…ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేలా నిఘా వ్యవస్థ.

బస్ షెల్టర్ ప్రారంభంలో ముఖ్యంగా నగరానికి కొత్తగా పరిచయం కానుంది లూకేఫ్. అతి తక్కువ స్థలంలో ఎంతో ప్రత్యేకతలున్న టాయిలెట్.  దక్షిణాసియాలో అత్యంత విలాసవంతమైన లాయిలెట్ గా లూకేఫ్ రికార్డు కెక్కనుంది.భావితరాలకు సాంకేతిక పరిజ్ఞానంతో ఇగ్జోర ఎఫ్ అనే సంస్థ నిర్మాణాన్ని తయారు చేసింది. అతి తక్కువ నీటితో విసర్జితాలను నిర్వహించే అరుమ థెరపీ విధానాన్ని ఉపయోగించి మరుగుదొడ్డిని రూపొందించారు.

Posted in Uncategorized

Latest Updates