లూథియానా: స్వీప్ చేసిన కాంగ్రెస్, బీజేపీ డీలా 

congపంజాబ్‌లోని లూథియానా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. బీజేపీ, శిరోమణి అకాలీదళ్ కూటమి కంగు తింది. లూథియానాలోని 95 వార్డుల్లో కాంగ్రెస్ 62 వార్డులను గెలుచుకుంది.

శిరోమణి అకాలీదళ్, బీజేపీ కూటమి 21 వార్డులకే పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్ 11 వార్డులను, బీజేపీ 10 వార్డులను గెలుచుకున్నాయి. ఎల్పీ, ఏఏపి కూటమి 8 వార్డుల్లో విజయం సాధించింది. నాలుగు వార్డుల్లో ఇండిపెండెట్లు గెలిచారు. అతి పెద్ద మునిసిపాలిటీ అయిన లూథియానాలో పాగా వేసేందుకు కాంగ్రెస్ తీవ్రంగానే కృషి చేసింది.

Posted in Uncategorized

Latest Updates