లెక్కలు చెబుతున్న నిజం : ఉద్యోగాలు వదిలేసి.. IT  కంపెనీలకు వెళ్తున్న కలెక్టర్లు

all-india
మా అబ్బాయి కలెక్టర్ అయ్యాడు అంటూ గర్వంగా చెప్పుకునే రోజులు పోయాయా.. సివిల్స్ ర్యాంక్ కొట్టి.. జిల్లాకు కలెక్టర్ అయినా కూడా హ్యాపీగా లేరా వారు.. కలెక్టర్ ఉద్యోగం కంటే.. ఐటీ కంపెనీలో బాస్ హోదా వారికి ముద్దొస్తుందా.. అవును ఇది పక్కా నిజం.. ఇప్పుడు కలెక్టర్ ఉద్యోగం కంటే.. ఐటీ కంపెనీలో బాస్ హోదా కోసం పలుగులు పెడుతున్నారు సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు. గత పదేళ్లలో 180 మంది IAS, IPS హోదాను వదిలేసి అటువైపు అడుగులు వేశారు. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

కార్పొరేట్ కంపెనీలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు IAS, IPS హోదాలోని వారికి వల వేస్తున్నారు. ఆయా కంపెనీల్లో సీఈవోలుగా, డైరెక్టర్లుగా తీసుకుంటున్నాయి. పాలనాపరమైన విధానాలపై వీరికి పట్టుఉండటం, ప్రభుత్వంలో డీల్ చేయాల్సిన విషయాలు, ప్రాజెక్టుల ఎంపిక, అందులోని లోటుపాట్లను గుర్తించటంలో వీరు మెరుగ్గా వర్క్ చేస్తారంట. మిగతా వాళ్లతో పోల్చితే IAS, IPS ఉద్యోగాలు చేస్తున్న, రిటైర్డ్ అయిన వారిని రిక్రూట్ చేసుకోవటం వల్ల కంపెనీల్లోని పాలన విధానాలపై ఒత్తిడి తగ్గిపోతుందంట. ఈ క్రమంలోనే రిటైర్డ్ అవుతున్న వారికి కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇచ్చి మరీ తీసుకుంటున్నాయి కంపెనీలు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పుట్టిన కంపెనీలు అయితే వీరికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం విశేషం, గత 10 సంవత్సరాల్లో 180 మంది IAS, IPS, ఇతర సర్వీసుల నుంచి కార్పొరేట్ కంపెల వైపు వెళ్లారు.

S.G.K.కిషోర్. 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. 2006 వరకు కలెక్టర్ గా, ప్రభుత్వ కార్పొరేషన్లకు ఎండీగా పని చేసిన ఈయన.. ప్రభుత్వ సర్వీస్ ఉండగానే రాజీనామా చేశారు. ఆ తర్వాత GMR గ్రూప్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఈ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న శంషాబాద్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ కు సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1976 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ K.V.రావు… రిటైర్డ్ అయిన తర్వాత నాగార్జున గ్రూప్ లో కీలక పదవిలో కొనసాగుతున్నారు. మరో రిటైర్డ్ ఆఫీసర్ కె.ప్రభాకర్ రెడ్డి కృష్ణపట్నం పోర్ట్ ఎండీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఇప్పుడు మాజీలతోపాటు సర్వీసుల్లో కొనసాగుతున్న సివిల్ సర్వీసెస్ ఉద్యోగులను కోట్ల రూపాయల ప్యాకేజీలతో కార్పొరేట్ కంపెనీలు తీసుకెళుతున్నాయి. ఇప్పటికే 180 మంది కార్పొరేట్ వైపు వెళ్లగా.. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య భారీగా ఉండొచ్చని చెబుతున్నారు. ప్రభుత్వంలో ఉండే ఒత్తిడి లేకపోవటంతోపాటు మంచి జీతాలతోపాటు విదేశాల్లోనూ తిరిగే అవకాశం ఉండటంతో అటువైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రభుత్వంలో ఉండి ఏదైనా మార్పు తీసుకురావాలంటే ఎంతో కష్టం అదే.. ప్రైవేట్ కంపెనీల్లో అయితే రాత్రికి రాత్రి చేసేయొచ్చు. ఇది కూడా యువ అధికారులకు వరంగా మారింది.

Posted in Uncategorized

Latest Updates