లేటెస్ట్ టెక్నాలజీతో మల్లన్న సాగర్ పనులు : హరీశ్

మల్లన్న సాగర్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీశ్. రెట్టింపు వేగంతో పనులు జరగాలని సూచించారు. మంగళవారం (మార్చి-27) ప్యాకేజ్ 12 కింద జరుగుతున్న మల్లన్న సాగర్  రిజర్వాయర్, కాలువల పనులపై ఆరా తీశారు.

సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ నుంచి తొగుట మండలం తుక్కపూర్ వరకు సొరంగం, పంప్ హౌస్ పనులను పరిశీలించారు. మల్లన్నసాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో వ్యూహాత్మక ప్రదేశమని చెప్పారు మంత్రి. దీని ద్వారా 5జిల్లాలకు గోదావరి జలాలు అందిస్తామన్నారు.  వారం పది రోజుల్లో పంప్ హౌస్ పనులు, సర్జ్ పూల్  గేట్లు పూర్తి అవుతాయన్నారు.  విదేశీ మోటార్లతో..  లేటెస్ట్ టెక్నాలజీతో  పనులు చేపడుతున్నామన్నారు మంత్రి హరీశ్.

Posted in Uncategorized

Latest Updates