లేడీస్ స్పెషల్: మగవాళ్లకు నో ఎంట్రీ

lady
మ్యారేజ్,బర్త్ డే.. సందర్భం ఏదైనా పెద్దలు,చిన్నారుల హంగామాతో ఆ కార్యక్రమం సందడిగా ఉంటుంది. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఎవరికి వారు స్పెషల్ గా వెకేషన్స్ నిర్వహించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకోసం పురుషులు, స్త్రీలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో జపాన్ లో మెన్స్ కోసం ప్రత్యేక దీవి ఉన్నట్లుగానే…మహిళలు స్పెషల్ గా వారి కోసం దీవిని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో పురుషులకు అనుమతి లేదు.

ఫిన్లాండ్‌ తీరానికి అవతల ఉన్న దీవి మహిళలకు మాత్రమే. క్రిస్టినా రోత్‌ అనే అమెరికన్‌ బిజినెస్ ఉమెన్ ఆలోచన ఫలితంగా ఆ దీవి మహిళలకు విడిది కేంద్రంగా మారింది. వెకేషన్‌ కాలాన్ని ప్రశాంతంగా గడపడానికి క్రిస్టినా ఒకసారి రాంచ్‌ మాలిబు సమీపంలోని ఒక ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ పురుషులు ఎక్కువగా ఉండటంతో.. మహిళల ఏకాగ్రతకు, ప్రశాంతతకు ఇబ్బందిగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన క్రిస్టినా…పురుషుల కారణంగా మహిళలు ఇబ్బంది పడకుండా… కేవలం మహిళల కోసమే ఒక విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఫిన్లాండ్‌ తీరానికి అవతల ఎనిమిదిన్నర ఎకరాల దీవి అమ్మకానికి సిద్ధంగా ఉండటంతో..దాన్ని తానే కొనేసి, అన్ని సౌకర్యాలతో మహిళల విడిది కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ దీవిలో సేదదీరడానికి దేశ దేశాల నుంచి మహిళలు వస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు ఉండటం సంతోషంగా ఉందంటున్నారు మహిళా టూరిస్టులు.

Posted in Uncategorized

Latest Updates