లైంగిక ఆరోప‌ణ‌లపై ఎవ‌రైనా విచార‌ణ ఎదుర్కోవాల్సిందే

దేశంలో ఊపందుకుంటున్న‌ ‘మీటూ’ ఉద్యమంపై స్పందించారు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి మేనకా గాంధీ. కేంద్ర స‌హాయ మంత్రి ఎంజే అక్బర్‌ విషయంపై తప్పనిసరిగా విచారణ జరిపిస్తాన‌ని హామీ ఇచ్చారు. పదవిలో ఉన్నా… లేకున్నా ఆరోపణలు వచ్చిన వారు విచారణలు ఎదుర్కోవాల్సిందేనన్నారు. మీడియా, రాజకీయాలు, ఏ రంగాల వారైనా సరే దీని నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని గురించి బయటకు చెప్తుంటే దాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. వారు తమ అనుభవాలను బాహాటంగా చెబుతుంటే అది తమాషా ఎందుకవుతుందన్నారు కేంద్ర మంత్రి మేన‌కా గాంధీ.

Posted in Uncategorized

Latest Updates