లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం: ఇద్దరికి నోబెల్ శాంతి అవార్డు

లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఇద్దరికి ఈ ఏడాది నోబెల్ శాంతి దక్కింది. ఆఫ్రికా దేశం కాంగోకు చెందిన డెన్నిస్ ముక్వేజ్ తో పాటు యాజిది వర్గానికి చెందిన అత్యాచార బాధితురాలు నదియా మురాద్‌ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. సెక్సువల్ వాయిలెన్స్‌కు వ్యతిరేకంగా ఈ ఇద్దరూ పోరాటం చేశారు.

ఫిజిషియన్ అయిన డెన్నిస్.. తన జీవితాన్ని మొత్తం కాంగోకే దారపోశారు. లైంగిక దాడి బాధితులకు ఆయన హెల్ప్ చేశారు. లైంగిక దాడులకు బాధితులైన వేలాది మందిని డెన్నిస్‌తో పాటు ఆయన టీమ్ ఆదుకుంది. కాంగోలో అంతర్యుద్ధం జరిగిన సమయంలో ఎన్నో అరాచకాలు జరిగాయి. ఆ సమయంలో అనేక మంది లైంగిక వేధింపులకు గురయ్యారు. ఆ బాధితులకు డెన్నిస్ అండగా నిలిచారు.

ఇరాక్‌లో తనతో పాటు అనేక మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని నదియా మురాద్ తెలిపారు. అయితే రేప్‌లకు వ్యతిరేకంగా గళం ఎత్తిన ఆమె.. అనేక మంది బాధితుల తరపున పోరాటం చేశారు. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఆర్మీ సుమారు మూడు వేల మంది యాజిదీ తెగ మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడులకు తెగబడింది. అయితే తనకు జరిగిన అన్యాయాల గురించి ఆమె 23 ఏళ్ల వయసులోనే ఐక్యరాజ్యసమితి వేదికగా మాట్లాడారు.

Posted in Uncategorized

Latest Updates