లైంగిక వేధింపులపై ఢిల్లీ మహిళా కమిషనర్ నిరసన

UMENమహిళలపై  లైంగిక వేధింపులను ప్రభుత్వం అరికట్టాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్… నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు. కఠువాలో కశ్మీరీ చిన్నారిపైనా… ఉన్నావ్ లో దళిత యువతిపైనా గ్యాంగ్ రేప్ సంఘటనలు మహిళలకు బాధ కలిగిస్తున్నాయని… భవిష్యత్తుపై భయాన్ని, అభద్రతను పెంచుతున్నాయని ఆమె అన్నారు.
సోమవారం (ఏప్రల్-16)తో ఆమె దీక్ష మూడో రోజుకు చేరింది. తాను నిరాహార దీక్షకు దిగుతున్నానంటూ శుక్రవారం(ఏప్రిల్-13)న  ఆమె ప్రధానమంత్రికి లెటర్ ద్వారా తెలియజేశారు. రాజ్ ఘాట్ లో మహాత్ముడికి నివాళులు అర్పించిన తర్వాత.. ఆమె నిరాహార దీక్షను మొదలుపెట్టారు. యశ్వత్ సిన్హా సహా.. మహిళా కార్యకర్తలు చాలామంది ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates