లైంగిక వేధింపులు భరించలేక దాడి చేసిన మహిళ

 లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్వక్తి మర్మాంగాన్ని కోసేసింది బాధిత మహిళ. ఈ ఘటన ముంబైలోని డోంబివిలో జరిగింది. తుషార్ పుజారా అనే అతను ఒక మహిళను ప్రతీరోజు వేధిస్తున్నాడు. రోడ్డుపై వెళ్తుండగా శారీరకంగా తాకుతూ హింసిస్తున్నాడు. దీంతో అతని ఆగడాలను భరించలేని ఆ అమ్మాయి ప్లాన్ చేసి అతనిపై దాడి చేసింది. ఇందుకు మరో ఇద్దరు యువకులు ఆమెకు సహాయం చేశారు.

తుషార్ పై దాడి చేయాలని ఫిక్స్ అయిన ఆమె..  రహస్యంగా కలుద్దామని ఓ చోటుకి రప్పించింది.  అక్కడికి వెళ్లిన తుషార్ ను ఇద్దరు యువకులు బంధించగా అతడి మర్మాంగాన్ని ఆమె కోసేసింది. దీంతో తుషార్ కు తీవ్ర రక్తస్రావమవగా స్వయంగా హస్పిటల్ లో చేర్చింది.  విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను.. ఆమెకు సహాయం చేసిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి.. హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.

Posted in Uncategorized

Latest Updates