లైవ్ లోనే కొట్టుకున్నారు : పార్టీ పరువు గంగలో కలిపిన నేతలు

నోయిడా : డిబేట్ లో రాజకీయనాయకుల మాటలతూటాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. నా పార్టీ గొప్పది అంటే..తన పార్టీ సూపర్ అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. ఈ క్రమంలోనే వివాదాలు తీవ్రస్థాయికి చేరుకునే సంఘటనలు మనం నిత్యం టీవీ ఛానల్స్ లో చూస్తుంటాం. అయితే ఓ ఛానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఇద్దరు నేతలు ఘర్షణకు దిగారు. అంతటితో ఆగలేదు. లైవ్ లోనే నేతలు కొట్టుకున్నారు. ఈ ఘటన డిసెంబర్-9న ఉత్తర్‌ ప్రదేశ్‌ లో జరగగా..ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది.

నోయిడాలో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో BJP నేత గౌరవ్‌ భాటియా, SP అధికార ప్రతినిధి అనురాగ్‌ భడోరియా పాల్గొన్నారు. ఓ అంశంపై చర్చిస్తున్న ఈ ఇద్దరు నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ పెద్దదిగామారి, కొట్టుకునే వరకూ వెళ్లింది. BJP నేతపై SP నేత దాడికి దిగారు. లైవ్ నడుస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. నిమిషాల్లోనే లక్షల వ్యూస్ వచ్చాయి. నేతల కొట్లాటతో పార్టీల పరువు గంగలో కలిసినట్టయ్యిందని సీరియస్ అవుతున్నారు పార్టీల నేతలు. ఘటన తర్వాత BJP నేత ఫిర్యాదు మేరకు ఎస్పీ నేత అనురాగ్‌ భడోరియాను నిర్బంధించినట్లు తెలిపారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులకు చూపించారు నేతలు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

Posted in Uncategorized

Latest Updates