లైవ్ లోనే బల పరీక్ష : ప్రొటెం స్పీకర్ నియామకంపై జోక్యం చేసుకోమన్న సుప్రీం

ROHATKIకాంగ్రెస్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రొటెం స్పీకర్ పై కాంగ్రెస్-జేడీస్ పిటిషన్ ను కొట్టిపారేసింది సుప్రీంకోర్టు. ప్రొటెం స్పీకర్ నియామకంపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ప్రొటెం స్పీకర్ నియామకం రాజ్యాంగ నిబంధన పరిధిలోకి రాదని తేల్చి చెప్పింది సుప్రీం. అయితే బల పరీక్షను లైవ్ టెలికాస్ట్ చేయాలని సూచించింది. కాంగ్రెస్-జేడీఎస్ తరుపున న్యాయవాదులు సింఘ్వి సిబాల్ వాదనలు వినిపించగా..బీజేపీ తరుపున రోహత్గీ వాధించారు.

ప్రొటెం స్పీకర్ సీనియరే ఉండాలని రాజ్యాంగలో లేదని కూడా స్పష్టం చేసింది సుప్రీం. ప్రొటెం స్పీకర్ ను మారిస్తే బల పరీక్షను కూడా వాయిదా వేయాల్సి వస్తుందని కూడా సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది.   కేజీ బోపయ్యనే ప్రొటెం స్పీకర్‌గా కొనసాగుతారని కోర్టు స్పష్టం చేసింది.  ప్రొటెం స్పీకర్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్ సుప్రీంకోర్టులో శనివారం (మే-19) ఉదయం పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే బలపరీక్ష జరుగుతుందని కోర్టు తేల్చిచెప్పింది. యడ్యూరప్ప ఎదుర్కొనే బలపరీక్షను ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని జస్టిస్ ఏకే సిక్రీ ఆదేశించారు.  అయితే ప్రొటెం స్పీకర్ బోపయ్య నియామకంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్, జేడీఎస్ తరపున కపిల్ సిబల్ వాదించారు. బోపయ్య అర్హతల పరిశీలన జరగాలంటే ఆయనకు నోటీసులు ఇస్తామని కోర్టు చెప్పింది. ప్రొటెం స్పీకర్ గా బోపయ్య నియామకంపై నోటీసులు ఇస్తే విశ్వాస పరీక్ష వాయిదా వేయాల్సి ఉంటుందని చెప్పింది.

Posted in Uncategorized

Latest Updates